కంటేశ్వర్( నిజామాబాద్ ) : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో పోలీసులు మంగళవారం రోడ్డు భద్రత ( Road Safety ) పై అవగాహన కల్పించారు. ఎస్సై ఆరిఫ్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్,హెల్మెట్ , ఇన్సూరెన్స్, ట్రిపుల్ రైడింగ్,ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు.
ఎస్సై మాట్లాడుతూ అందరూ రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడిపినా, త్రిపుల్రైడింగ్,మైనర్లకువాహనాలు ఇచ్చిన సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి అందరూ సురక్షితంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై ఆరిఫ్ తో పాటు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.