IND vs AUS : సిరీస్ సమం చేయాల్సిన మూడో టీ20లో భారత్ పవర్ ప్లేలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. దంచికొడుతున్న అభిషేక్ శర్మ(25)ను వెనక్కి పంపిన నాథన్ ఎల్లిస్ పెవిలియన్ పంపాడు. వరుసగా విఫలమవుతున్న శుభ్‌మన్ గిల్(15) ఈసారి నిలబడతాడనుకుంటే ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో.. 61 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(19 నాటౌట్), తిలక్ వర్మ(2 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు స్కోర్.. 64-2. ఇంకా విజయానికి 84 పరుగులు కావాలి.
మూడో టీ20లో ఆస్ట్రేలియాను కట్టడి చేసిన భారత్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(25) సిక్సర్లతో దడ పుట్టించాడు. తొలి ఓవర్లోనే సిక్సర్ల్ బాదిన అభిషేక్.. సీన్ అబాట్ వేసిన రెండో ఓవర్ చివరి మూడు బంతులను 4, 6, 4 గా మలిచాడు. దాంతో ఆ ఓవర్లో 17 రన్స్ వచ్చాయి. చితక్కొడుతున్న అభిషేక్‌ను నాథన్ ఎల్లిస్ వెనక్కి పంపాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ పరుగెత్తుతూ వచ్చి చక్కని క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(19 నాటౌట్) తనదైన షాట్లతో చెలరేగిపోతున్నాడు.