Electra Stumps : క్రికెట్లో డీఆర్ఎస్(Descision Review System)తో మొదలు ఐపీఎల్లో ఇంప్యాక్ట్ ప్లేయర్(Impact Player) వంటి కొత్త నిబంధనలు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. ఇప్పుడు మహిళల బిగ్‌బాష్ లీగ్(Womens Big Bosh League)లోనూ అభిమానులను ఆకట్టుకునేందుకు కొత్తరకం టెక్నాలజీ వాడుతున్నారు. రంగులొలికే ఎలక్ట్రా స్టంప్స్(Electra Stumps)ను ప్రవేశ పెట్టారు.
ఎలెక్ట్రా స్టంప్స్‌ను తొలిసారిగా సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రయికర్స్ మ్యాచ్‌లో ఉపయోగించారు. రంగుల కాంతులీనే ఈ సరికొత్త స్టంప్స్ పనితీరును తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్(Mikheal Vaughan), ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మార్క్ వా (Mark Waugh) వివరించారు.
For the first time in the BBL…
The electra stumps are on show 🪩 #BBL13 pic.twitter.com/A6KTcKg7Yg
— KFC Big Bash League (@BBL) December 22, 2023
ఎలెక్ట్రా స్టంప్స్‌లో పలు రంగులతో కూడిన లైట్స్ ఉంటాయి. మ్యాచ్ సమయంలో ఇవి పలు రంగుల్లో వెలుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఉదాహరణకు బ్యాటర్ ఔట్ అయ్యాడనుకోండి.. ఈ స్టంప్స్ పూర్తిగా ఎరుపు రంగులో మెరుస్తాయి. బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు బాదినప్పుడు వేరే రంగులో ప్రకాశిస్తాయి.
స్టంప్స్ పనితీరు వివరిస్తున్న మైఖేల్ వాన్, మార్క్ వా
ఇక నోబాల్ వేసినప్పుడు ఇవి ఎరుపు, తెలుపు రంగులో మిరుమిట్లు గొలుపుతాయి. దాంతో, అంపైర్ నిర్ణయం కంటే ముందే అది నో బాల్ అని ఫ్యాన్స్‌కు తెలిసిపోతుంది. అంతేకాదండోయో.. ఓవర్ పూర్తయ్యాక ఈ స్టంప్స్ ఊదా, నీలం రంగులో జిగేల్మంటూ కనువిందు చేస్తాయి. మహిళల బీబీఎల్‌తో ఎంట్రీ ఇచ్చిన ఎలెక్ట్రా స్టంప్స్‌ను పురుషుల బీబీఎల్ 2023-24 సీజన్ లోనూను ప్రవేశపెట్టనున్నారు.