Ind Vs AUS | ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్వదేశంలో ఆసిస్‌తో జరిగే తొలి టెస్ట్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. ఈ నెల 9న భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా టెస్టు సిరీస్ మొదలుకానున్నది. అయితే, శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయం సమస్య నుంచి ఇంకా కోలుకోలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ముందు గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం అయ్యర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
గతేడాది డిసెంబర్లో బంగ్లాదేశ్‌పై భారత్ 2-0తో టెస్టు సిరీస్‌ను గెలువడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక తొలిటెస్టులో మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్‌ను బ్యాటింగ్‌కు దింపాలని భారత జట్టు మేనేజ్మెంట్ యోచిస్తున్నది. ఇదే నిజమైతే సూర్యకుమార్ యాదవ్ టెస్టుల్లోకి అరంగ్రేటం చేయనున్నారు. అలాగే శుభ్‌మన్ గిల్‌కు సైతం మిడిల్ ఆర్డర్లో పోటీపడుతున్నాడు. ఇద్దరిలో ఒకరికే చాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి.
ఒక కేఎల్ రాహుల్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్‌కు దిగనున్నారు. వరుసగా ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ వరుసగా మూడు, నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేయనున్నారు. ఇక ఐదో నంబర్ స్థానంలో బ్యాటింగ్ కీలకం. ఈ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ చక్కగా సరిపోగా.. అతని గైర్హాజరీలో ఎవరితో భర్తీ చేస్తారన్నది కీలకంగా మారింది. అయ్యర్ ప్రస్తుతం పునరాగమనం చేసేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీలో శ్రమిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో నాలుగు టెస్టులు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నది.