ECB : టీమిండియాతో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ పకడ్బందీగా సిద్దమవుతోంది. సొంతగడ్డపై విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది ఆతిథ్య జట్టు. పొట్టి వరల్డ్ కప్ ముందు (T20 World Cup 2026) ఇరుజట్లకు ఇది కీలకమైన సిరీస్. ఇప్పటికే భారత బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించడంతో శుక్రవారం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సైతం తమ స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. శుక్రవారం 14 మందితో కూడిన పటిష్టమైన బృందాన్ని పొట్టి సిరీస్ కోసం ఎంపిక చేశారు సెలెక్టర్లు. నాట్ సీవర్ బ్రంట్ సారథిగా వ్యహరించనుండగా.. గాయం నుంచి కోలుకున్న స్పిన్ ఆల్‌రౌండర్ సోఫీ ఎకిల్‌స్టోన్(Sophie Ecclestone)ను తీసుకున్నారు సెలెక్టర్లు.
‘టీమిండియాతో సిరీస్ కోసం మేము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటైన భారత్‌తో సిరీస్ మాకు పరీక్షలాంటిది. సొంత ప్రేక్షకుల సమక్షంలో భారత జట్టుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ చాలా గొప్పగా సాగనుంది. టీ20 వరల్డ్ కప్ సన్నద్ధతలో ఉన్న మాకు ఈ సిరీస్ చాలా కీలకం. అందుకే.. గెలుపే లక్ష్యంగా ఆడనున్నాం’ అని ఇంగ్లండ్ మహిళల జట్టు హెడ్‌కోచ్ చార్లొల్టె ఎడ్వర్డ్స్ తెలిపింది.
Sophie Ecclestone returns to England’s squad for the upcoming five-match T20I series against India, starting on June 28 🏴 pic.twitter.com/EN3mn7ozMW
— ESPNcricinfo (@ESPNcricinfo) June 13, 2025
ఇంగ్లండ్ స్క్వాడ్ : నాట్ సీవర్ బ్రంట్(కెప్టెన్), ఎమ్ అర్నాట్, టామీ బ్యూమంట్(వికెట్ కీపర్), లారెన్ బెల్, అలిసే క్యాప్సే, చార్లీ డీన్, సోపీ డంక్లే, సోఫీ ఎకిల్‌స్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్(వికెట్ కీపర్), పైగే స్కూల్ఫీల్డ్, లీన్సే స్మిత్, డానీ వ్యాట్ హొడ్గే, ఇసీ వాంగ్.
ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. జూన్ 28న ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్‌తో పొట్టి సీరస్ షురూ కానుంది. బ్రిస్టోల్‌లో జూలై 1న రెండో టీ20, ఓవల్ వేదికగా జూలై 4న మూడో మ్యాచ్ జరుగనుంది. జూలై 9న నాలుగో టీ20, జూలై 12న ఐదో టీ20తో సిరీస్ ముగియనుంది. అనంతరం వన్డే సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి.
🚨 NEWS 🚨
Radha Yadav named as replacement for injured Shuchi Upadhyay in #TeamIndia’s squads for the England tour.
Details 🔽 #ENGvINDhttps://t.co/4p36zNga3M
— BCCI Women (@BCCIWomen) June 12, 2025
టీ20 స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), యస్తికా భాటియా(వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, అమన్‌జోత్ కౌర్, అరుంధతీ రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే, రాధా యాదవ్.