ECB | లండన్: ట్రాన్స్జెండర్ క్రికెటర్లకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) షాకిచ్చింది. ఇక నుంచి వారు మహిళల, బాలికల క్రికెట్ ఆడకుండా వారిపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల అక్కడి సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ఈసీబీ చర్యలకు ఉపక్రమించింది.
‘పుట్టుకతో ఆడవారిగా జన్మించినవాళ్లు మాత్రమే మహిళల, బాలికల క్రికెట్ ఆడటానికి అర్హులు. లింగమార్పిడి చేయించుకున్నవారు ఓపెన్, మిక్స్డ్ క్రికెట్లో పాల్గొనవచ్చు’ అని ఈసీబీ తెలిపింది. రెండ్రోజుల క్రితమే ఇంగ్లండ్ ఫుట్బాల్ అసోసియేషన్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది.