కోల్‌కతా: డ్యురాండ్ కప్‌లో ఈస్ట్‌బెంగాల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన కీలకమైన క్వార్టర్స్ పోరులో ఈస్ట్‌బెంగాల్ 2-1తో మోహన్ బగాన్‌పై అద్భుత విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థుల మధ్య సాగిన పోరులో ఈస్ట్‌బెంగాల్ తరఫున స్ట్రైకర్ దిమిత్రోస్ దియామన్కోస్(38ని, 52ని) డబుల్ గోల్స్‌తో అదరగొట్టాడు.
మరోవైపు అనిరుధ్ తాపా(68ని).. మెహన్ బగాన్ సూపర్‌జెయింట్స్‌కు ఏకైక గోల్ అందించాడు. 18వ నిమిషంలో హమిద్ అహబాద్ గాయపడటంతో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన దిమిత్రోస్..ఈస్ట్‌బెంగాల్‌కు ట్రంప్‌కార్డ్‌గా మారాడు. ఈనెల 20న జరిగే సెమీస్‌లో ఈస్ట్ బెంగాల్..డైమండ్ హార్బర్ ఎఫ్‌సీతో తలపడుతుంది.