సెయింట్ జార్జ్స్ (గ్రెనడా): కెప్టెన్ పొలార్డ్ (51 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 21 పరుగుల తేడాతో గెలిచిన వెస్టిండీస్ సిరీస్ను 2-2తో సమం చేసింది. పొలార్డ్, సిమన్స్ (47) రాణించడంతో మొదట విండీస్ 6 వికెట్లకు 167 పరుగులు చేయగా.. ఛేదనలో సఫారీలు 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమయ్యారు.