RCB vs CSK : సొంత మైదానంలో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(0) హాఫ్ సెంచరీ బాదాడు. చెన్నై స్పిన్ ఉచ్చును ఛేదిస్తూ బౌండరీలు బాదుతున్న ఫాఫ్ అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. జడేజా ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు బాదిన డూప్లెసిస్ ఆ తర్వాత తీక్షణ ఓవర్లో సింగిల్ తీసి యాభై పూర్తి చేసుకున్నాడు. అయితే.. శాంట్నర్ ఓవర్లో రజత్ పాటిదార్(11) కొట్టిన బంతి వికెట్లకు తాకడంతో డూప్లెసిస్ రనౌట్ అయ్యాడు. దాంతో, 13 ఓవర్లకు ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 114 రన్స్ కొట్టింది.
టాస్ ఓడిన బెంగళూరుకు ఓపెనర్లు ఫాఫ్ డూప్లెసిస్(12), విరాట్ కోహ్లీ(19)లు శుభారంభమిచ్చారు. అయితే.. మూడో ఓవర్ తర్వాత వాన రావడంతో ఆర్సీబీ పరుగుల వరదకు బ్రేక్ పడింది. ఇక వాన తగ్గాక బంతి బాగా టర్న్ కావడంతో ఆర్సీబీ ఓపెనర్లు రన్స్ తీయలేక ఇబ్బంది పడ్డారు.
Faf du Plessis is run-out at the non-strikers end!
Cameron Green joins Rajat Patidar in the middle
Follow the Match ▶️ https://t.co/7RQR7B2jpC#TATAIPL | #RCBvCSK pic.twitter.com/ZcFqSiPLNJ
— IndianPremierLeague (@IPL) May 18, 2024
స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత దంచుడు మొదలెట్టిన ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ(47) ఔటయ్యాడు. శాంట్నర్ వేసిన 10వ ఓవర్లో సిక్సర్ బాదిన విరాట్.. ఆ తర్వాత బంతికి భారీ షాట్ ఆడాడు. అక్కడే కాచుకొని ఉన్న డారిల్ మిచెల్ బంతిని అద్భుతంగా పట్టుకున్నాడు. దాంతో, 78 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ పడింది. ఆ కాసేపటికే శాంట్నర్.. డూప్లెసిస్‌ను రనౌట్ చేసి బెంగళూరును దెబ్బకొట్టాడు.