ముంబై: దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరు వేదికను బెంగళూరు నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియానికి మారుస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి సైకియా ప్రకటించారు. బెంగళూరు సీఓఈలో ప్రేక్షకుల ప్రవేశంపై ఉన్న పరిమితుల దృష్ట్యా, అభిమానులు మైదానంలో నేరుగా మ్యాచ్‌ను వీక్షించేందుకే సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు జరిగే తుదిపోరును చెన్నై తరలిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ నెల 23 నుంచి జరిగే క్వార్టర్స్, సెమీఫైనల్ మ్యాచ్‌లతో పాటు మిగిలిన టోర్నీ మొత్తం నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే బెంగళూరులోనే కొనసాగనుంది.