బెంగళూరు: దులీప్ ట్రోఫీ ఫైనల్స్‌లో మొదట బంతితో ఆ తర్వాత బ్యాట్‌తో రాణించిన సెంట్రల్ జోన్ జట్టు.. టైటిల్‌ను చేజిక్కించుకునేందుకు చేరువైంది. సౌత్‌జోన్‌తో జరుగుతున్న తుదిపోరులో ఆ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 511 పరుగుల భారీ స్కోరు చేసింది.
తద్వారా 362 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆట రెండో రోజు సెంచరీ చేసిన యశ్ రాథోడ్ (194) మూడో రోజు తృటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నాడు.అనంతరం 362 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 129 రన్స్ చేసింది.