అనంతపూర్: దులీప్ ట్రోఫీలో ఇం డియా ‘బీ’, ‘డీ’ జట్ల మధ్య రసవత్తర పో రు జరుగుతున్నది. రికీ భుయ్(90 నాటౌ ట్), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(50) అర్ధసెంచరీలతో ఇండియా ‘డీ’ రెండో ఇన్నింగ్స్‌లో 244/5 స్కోరు చేసింది. భుయ్ బాధ్యాయుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. ముకేశ్ (3/80) ఆకట్టుకున్నాడు. ఇండియా ‘డీ’ ప్రసుత్తం 311 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఓవర్‌నైట్ స్కోరు 210/6తో తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇండియా ‘బీ’ 282 కు ఆలౌటైంది.