పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు(Aus Vs Eng)లో ఇంగ్లండ్ పట్టు బిగిస్తున్నది. రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు తొలి సెషన్లో వికెట్ నష్టానికి 59 రన్స్ చేసింది ఇంగ్లండ్. దీంతో ఆ ఆతిథ్య జట్టు ప్రస్తుతం 99 రన్స్ ఆధిక్యంలో ఉన్నది. ఇవాళ ఉదయం 123 రన్స్ వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 9 పరుగులు జోడించి 132 రన్స్‌కు ఆలౌటైంది. పెర్త్ టెస్టులో తొలి రోజే ఇరు జట్లకు చెందిన 19 వికెట్లు కూలిన విషయం తెలిసిందే. ఫస్ట్ డే తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్ తన ఖాతాలో ఏడు వికెట్లు వేసుకున్నాడు. ఇక ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. ఇంగ్లండ్ తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 172 రన్స్‌కు ఆలౌటైంది.
ఇవాళ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు వికెట్లకు అతుక్కుపోయారు. స్టార్క్ బౌలింగ్‌లో ఓపెనర్ జాక్ క్రాలీ డకౌట్ అయినా.. రెండో వికెట్‌కు ఓలీ పోప్, బెన్ డకెట్ అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ ఇద్దరూ ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. డకెట్ 28, పోప్ 24 రన్స్‌తో బ్యాటింగ్ చేస్తున్నారు. స్టార్క్ తన ఫస్ట్ ఓవర్లోనే క్రాలీని ఔట్ చేశాడు. క్రాలీ కాటన్ బోల్డ్ అయ్యాడు. అద్భుతమైన రీతిలో స్టార్క్ ఆ క్యాచ్ అందుకున్నాడు.
WHAT A RIDICULOUS TAKE! Mitchell Starc sends Zak Crawley off for a pair! #Ashes | #PlayoftheDay | @nrmainsurance pic.twitter.com/1cg8PtLzx4
— cricket.com.au (@cricketcomau) November 22, 2025