హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ యంగ్ క్రికెటర్లు ధృతి కేసరి, మమత మదివాల బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) నిర్వహించనున్న ఎమర్జింగ్ అండర్-23 మహిళల హై పెర్ఫార్మెన్స్ క్యాంప్‌నకు ఎంపికయ్యారు.
బెంగళూరు వేదికగా జూలై 13 నుంచి ఆగస్టు 6 వరకు ఈ శిక్షణా శిబిరం జరగనుంది. ఎంపికైన ప్లేయర్లు జూలై 12వ తేదీలోపు సీఓఈలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.