Anvay Dravid : భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వారసులు క్రికెట్లో దూసుకొస్తున్నాడు. పెద్దబ్బాయి సమిత్ ద్రవిడ్ (Samit Dravid) ఇప్పటికే జూనియర్ స్థాయిలో సత్తా చాటుతుండగా.. చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) సైతం నిలకడగా రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. టాపార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ అయిన అతడు అండర్ -19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. ఈ ట్రోఫీలో అన్వయ్ టీమ్ సీకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. బుధవారం హైదరాబాద్ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీలో గనుక అన్వయ్ చెలరేగి ఆడితే అండర్ -19 జట్టులోకి రావడం ఖాయం.
‘హైదరాబాద్ వేదికగా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ పురుషుల అండర్-19 వన్డే కప్ ఛాలెంజర్ ట్రోఫీ జరుగనుంది. ఈ ట్రోఫీ కోసం జూనియర్ సెలెక్టర్లు నాలుగు జట్లకు ప్రతిభావంతులను ఎంపిక చేశారు. నవంబర్ 5 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఏడురోజుల పాటు సాగే ఈ ట్రోఫీ నవంబర్ 11న ముగియనుంది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
Younger Son of Rahul Dravid – Anvay Dravid is leading Karnataka U16 Team in #VijayMerchant Trophy today.
📸 Photo Credits – Six Cricket Community (Instagram)#CricketTwitter https://t.co/XgNSW4Gpv8 pic.twitter.com/Vxl8VhwcyR
— Indian Domestic Cricket Forum – IDCF (@IDCForum) December 1, 2023
‘ది వాల్’, ‘మిస్టర్ డిపెండబుల్’గా భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన రాహుల్ ద్రవిడ్ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు అతడి కుమారులు. తండ్రి స్ఫూర్తితో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న సమిత్ , అన్వయ్ ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు. కర్నాటక క్రికెట్లో సంచలనంగా ప్రశంసలు అందుకుంటున్న తన్వయ్.. విజయ్ మర్చంట్ ట్రోఫీలో టాప్ స్కోర్‌గా నిలిచాడు. ఈ ట్రోఫీలో అతడు ఆరు మ్యాచుల్లో 91.80 సగటుతో మూడు సెంచరీలతో కలిపి 459 పరుగులు సాధించాడు. అంతేకాదు అండర్ -19 వన్డే టోర్నమెంట్లో కర్నాటకకు అన్వయ్ సారథ్యం వహించాడు కూడా. అతడి సోదరుడు సమిత్ ఈమధ్యే ముగిసిన మహారాజా టీ20 ట్రోఫీలో మెరిశాడు.
Samit Dravid’s coach on Samit’s selection! 🗣️ pic.twitter.com/3Nis2qVIcy
— CricketGully (@thecricketgully) September 2, 2024
టీమ్ సీ స్క్వాడ్ : అరోన్ జార్జ్(కెప్టెన్), ఆర్యన్ యాదవ్(వైస్ కెప్టెన్), అంకిత్ ఛటర్జీ, మనికాంత్ శివానంద్, రాహుల్ కుమార్, యశ్ కస్వంకర్, అన్వయ్ ద్రవిడ్(వికెట్ కీపర్), యువ్‌రాజ్ గోహిల్(వికెట్ కీపర్), ఖిలాన్ పటేల్, కనిష్క్ చౌహన్, ఆయుష్ శుక్లా, హెనిల్ పటేల్, లక్ష్మణ్ ప్రుథి, రోహిత్ కుమార్ దాస్, మోహిత్ ఉల్వా.