బెర్లిన్ : రెండు రోజుల క్రితం గినియాలో జరిగిన ఓ సాకర్ మ్యాచ్లో తొక్కిసలాటకు గురై 56 మంది మరణించిన ఘటన మరువకముందే జర్మనీలో మరో ఫుట్బాల్ మ్యాచ్లో హింస చెలరేగిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత నెల 30న కార్ల్ జీస్ జెనా ఎఫ్సీ, బీఎస్జీ చెమీ లీప్జిగ్ మధ్య జరిగిన మ్యాచ్లో పోలీసుల అత్యుత్సాహంతో సుమారు 80 మంది గాయపడ్డారు. మ్యాచ్లో కార్ల్ జీస్ 5-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలోనే ఆ జట్టు అభిమానులు నగరంలో భారీ ర్యాలీకి దిగారు. స్టేడియానికి సమీపంలోనే ఈ ప్రదర్శన జరగ్గా దీనికి అనుమతుల్లేవనే కారణంతో పోలీసులు అభిమానులను అడ్డుకున్నారు.