Neeraj Chopra | భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. ఒలింపియన్ మెడలిస్ట్ ఆదివారం రహస్యంగా ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని నీరజ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నానని.. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. పెళ్లి ఫొటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. దాంతో అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, వధువు పేరు హిమానీగా తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియరాలేదు.