Neeraj Chopra | ఢిల్లీ: భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం అతడే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో.. సోనిపట్‌కు చెందిన హిమానిని నీరజ్ వివాహమాడాడు. హిమాని ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టు సమాచారం. ఆమె టెన్నిస్ క్రీడాకారిణి.
2016లో మలేషియాలో జరిగిన వరల్డ్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణ పతకం గెలిచింది. 2017 వరల్డ్ యూని వర్సిటీ గేమ్స్‌లోనూ పాల్గొంది. మూడు రోజుల క్రితమే వీరి పెండ్లి జరిగిందని చెప్పిన నీరజ్ బంధువు.. ప్రస్తుతం కొత్త జంట హనీమూన్ కోసం అమెరికాలో ఉన్నట్టు తెలిపాడు.