డెహ్రాడూన్: ఇవాళ అక్షయ తృతీయ. ఈ పర్వదినం నేపథ్యంలో.. ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ యాత్ర మొదలైంది. ఇవాళ ఉదయం గంగోత్రి(Gangotri Dham), యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇవాళ గంగోత్రి వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేద మంత్రోచ్చరణ మధ్య ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు గంగోత్రి ఆలయాన్ని తెరిచారు. ఆ తర్వాత 11.30 నిమిషాలకు యమునోత్రి ఆలయాన్ని ఓపెన్ చేశారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజునే ఛార్‌దామ్ యాత్ర ప్రారంభం అవుతుంది.
#WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami arrived at Gangotri Dham and offered prayers
On the auspicious occasion of Akshaya Tritiya today, the doors of Yamunotri Dham and Gangotri Dham have been opened for the devotees. pic.twitter.com/6oqTPdgCZx
— ANI (@ANI) April 30, 2025
మే 2వ తేదీన కేదార్నాథ్ ఆలయాన్ని తెరవనున్నారు. ఉదయం 6.20 నిమిషాలకు గుడిని తెరుస్తారు. ఆలయాన్ని ఇప్పటికే పువ్వులతో అందంగా అలంకరించారు. ఆ రోజున 7 గంటల తర్వాత భక్తులకు ప్రవేశాన్ని కల్పిస్తారు. ఇక మే 4వ తేదీన బద్రీనాథ్ ఆలయాన్ని తెరవనున్నారు.