Ravi Shastri | ముంబై: క్రికెట్లోనే గొప్ప సమరంగా భావించే భారత్, పాకిస్థాన్ మ్యాచ్లో.. టీమ్ఇండియా మరోసారి విజేతగా నిలిచింది. వన్డే ప్రపంచకప్లో దాయాది చేతిలో ఓటమంటూ ఎరుగని భారత్ 8వ విజయంతో రికార్డును నిలబెట్టుకుంది. పాక్ తురుపుముక్కగా పేరొందిన షాహీన్ ఆఫ్రిది ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసినా.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. కొత్త బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించే ఈ లెఫ్ట్ఆర్మ్ పేసర్.. శనివారం రోహిత్ శర్మ బాదుడుకు ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నాడు.
అహ్మాదాబాద్ ప్రదర్శన అనంతరం ఈ స్పీడ్స్టర్పై భారత లెజెండరీ క్రికెటర్ రవి శాస్త్రి షాకింగ్ కామెంట్లు చేశాడు. షాహీన్ ఏమీ పాక్ వెటరన్ వసీం అక్రమ్ కాదని, అతడిని ఆకాశానికి ఎత్తేయాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టాడు. ‘ఒకవేళ ఏ ఆటగాడు మంచి ప్రదర్శన కనబరిస్తే.. అతడిని మంచి ప్లేయర్ అనడం వరకే మన పొగడ్తలను పరిమితం చేయాలి. అంతేతప్ప అతడిని గొప్ప ఆటగాడంటూ ఆకాశానికెత్తేయొద్దు. షాహీన్ ఆఫ్రిది అంత గొప్ప బౌలర్ కాదు. ఆ విషయాన్ని మనమంతా అంగీకరించాలి’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.