Ausis Head Coach | బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ.. మాకు వామప్ మ్యాచ్ అవసరం లేదు : ఆసీస్ హెడ్ కోచ్
ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో మొదటి టెస్టు ప్రారంభం
Ausis Head Coach : బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ముందు ఆసీస్ హెడ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు తమకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం లేదని, తమ జట్టు మొదటి టెస్టుకు వారం ముందే భారత పర్యటనకు వస్తుందని ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అన్నాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధం అయ్యేందుకు, సిరీస్ అసాంతం తాము ఉత్సాహంగా ఉండేందుకు ఏడు రోజుల సమయం సరిపోతుందని మేము నమ్ముతున్నాం అని మెక్‌డొనాల్డ్ వెల్లడించాడు. అంతేకాదు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకపోవడం అనేది తమ జట్టుకు కలిసి వస్తుందని హెడ్ కోచ్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ముందుగా వచ్చి పరిస్థితులకు అలవాటు పడడం కంటే మానసికంగా, శారీరకంగా సన్నద్ధంగా ఉండడం చాలా ముఖ్యమని మెక్‌డొనాల్డ్ అన్నాడు. ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్ అదరగొడుతోంది. ఇప్పటికే రెండు టెస్టులు నెగ్గి సిరీస్ సొంతం చేసుకుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో మొదటి టెస్టు మొదలుకానుంది. అయితే.. ఇదే చివరి బోర్డర్-గవాస్కర్ కావడంతో ఇరు జట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. అంతేకాదు ఈ సిరీస్ ఫలితం ఇరు జట్ల వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (132 పాయింట్లు), భారత్(99 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. శ్రీలకం 65 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

