Lords Test : లార్డ్స్ టెస్టులో భారత అమ్మాయిలు అద్భుతం చేశారు. నాలుగో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లండ్ మిడిలార్డర్‌ను పడగొట్టి చరిత్రాత్మక విజయంతో సంబురాలు చేసుకున్నారు. టీ20 ప్రపంచకప్ వైఫల్యాన్ని మరిపించేలా.. 270 పరుగుల తేడాతో గెలుపొంది యావత్ భారతావనిని పులకింపజేశారు. తొలి ఇన్నింగ్స్‌లోనే ఇంగ్లండ్ పాలిట విలన్లా మారిన పేసర్ క్రాంతి గౌడ్(2-54) రెండో ఇన్నింగ్స్లోనేనిప్పులు చెరగడంతో ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు. యస్తికా భాటియా(113) రికార్డు శతకం.. స్మృతి మంధాన(70)ల బ్యాటింగ్ మెరుపులతో కుదేలైన ఇంగ్లండ్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇంగ్లండ్ గడ్డపై భారత పురుషుల జట్టుకు చెంపపెట్టులాంటి విజయం సాధించారు అమ్మాయిలు. పేలవమైన ఆటతో టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన శ్రేయాస్ అయ్యర్ సేనకు.. ఇంగ్లండ్‌ను ఇలా ఓడించాలి అని చాటిచెప్పింది హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం. లార్డ్స్‌లో జరిగిన ఏకైక టెస్టులో యువ పేసర్ క్రాంతి గౌడ్(2-54) విజృంభణతో ఆతిథ్య జట్టు బ్యాటర్లు తోకుముడిచారు. బ్యాటుతో మెరిసిన స్మృతి మంధాన(70), యస్తికా భాటియా(113)లు చిరస్మరణీయ విజయంలో కీలకమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తేలిపోయిన ఆతిథ్య జట్టు పొట్టి వరల్డ్‌కప్ ఓడిన చోటే.. ఏకైక టెస్టులోనూ చతికిలపడింది.
A day that goes down in the 𝗵𝗶𝘀𝘁𝗼𝗿𝘆 𝗯𝗼𝗼𝗸𝘀 📚#TeamIndia WIN the first-ever women’s Test match at Lord’s 🥳
Scorecard ▶️ https://t.co/O1rEau8j8n #ENGvIND pic.twitter.com/4mhcx8kKej
— BCCI Women (@BCCIWomen) July 13, 2026
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 341-7 వద్ద డిక్లేర్ చేశాక.. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 6 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. 457 పరుగుల భారీ ఛేదనలో క్రాంతి గౌడ్(2-54).. సయాలీ సత్ఘరే(2-24)ల ధాటికి ఆతిథ్య జట్టు చేతులెత్తేసింది. ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న టమ్మీ బ్యూమంట్(0), హీథర్ నైట్(13)లను ఔట్ చేసిన క్రాంతి విజయానికి పునాది వేసింది. మూడో రోజు పోరాడిన అమీ జోన్స్.. నాలుగోరోజు తొలి సెషన్లోనే ఔటవ్వగా.. టీమిండియా విజయం మరింత సలువైంది.
Stumps on Day 3!
A top-class bowling display in the last session to grab 6️⃣ wickets 👏#TeamIndia need just 4️⃣ more wickets to clinch a historic win at Lord’s 🤞
Scorecard ▶️ https://t.co/O1rEau8j8n #ENGvIND pic.twitter.com/b68r8BUvp8
— BCCI Women (@BCCIWomen) July 12, 2026
ఓవర్‌నైట్ స్కోర్ 130-6తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ చూస్తుండగానే కుప్పకూలింది. తొలి సెషన్ మొదట్లోనే అమీ జోన్స్(54) వికెట్ తీసిన స్నేహ్ రాణా(4-42) ఆతిథ్య జట్టు ఓటమిని ఖాయం చేసింది. సోఫీ ఎకిల్‌స్టోన్(50)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 22 రన్స్ జోడించిన ఇసీ వాంగ్(1)ను దీప్తి శర్మ బౌల్డ్ చేసింది. తర్వాతి ఓవర్లోనే లారెన్ బెల్(0)ను దీప్తి బౌల్డ్ చేయగా.. క్రీజునంటుకున్న ఎకిల్‌స్టోన్‌ను రాణా ఔట్ చేసి తరాతరాలు చెప్పుకోదగగిన విజయంలో భాగమైంది.
లార్డ్స్ టెస్టులో రెండో రోజు పట్టుబిగించిన భారత జట్టు పేసర్ క్రాంతి గౌడ్(5-37) సంచలన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను పడగొట్టింది. సొంతగడ్డపై దంచేయాలనుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లను వణికించిన క్రాంతి.. మొదటి సెషన్లోనే కోలుకోలేని దెబ్బకొట్టింది. ఓపెనర్ మియా బౌచిర్(23)ను పెవిలియన్ చేర్చిన స్పీడ్‌స్టర్.. బౌండరీలతో చెలరేగుతున్న అలిసే క్యాప్సే(9)ను స్వింగ్‌తో వెనక్కి పంపింది. మరో ఎండ్‌లో సయాలీ సత్ఘరే(2-40), స్నేహ్ రాణా(2-41) రెచ్చిపోగా లంచ్ లోపే సగం మంది పెవిలియన్ చేరారు.

అర్ధ శతకం బాదిన అమీ జోన్స్ (52) వెనుదిరిగినా.. పట్టువదలకుండా క్రీజునంటుకున్న కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(44) పోరాడింది. కానీ, లంచ్ తర్వాత ఆమెను సైతం గౌడ్ వెనక్కి పంపింది. లారెన్ బెల్‌ను ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో మొదటిసారి ఐదు వికెట్లు తీసింది భారత స్పీడ్‌స్టర్. చివరి బ్యాటర్ లారెన్‌ను దీప్తి ఎల్బీ చేయడంతో 170 వద్ద ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 115 పరుగుల ఆధిక్యం లభించింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్(58)లు అర్ధ శతకాలతో పటిష్టమైన పునాది వేసినా లాభం లేకపోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ మ్యాడీ విల్లియర్స్(2-79) ధాటికి మిడిలార్డర్ వైఫలమైంది. ఓవైపు వికట్లు పడుతున్నా బాధ్యతగా ఆడిన దీప్తి శర్మ(57) టెయిలెండర్లతో కలిసి పోరాడి స్కోర్ 280 దాటించింది. కానీ, ఒకే ఓవర్లో దీప్తిని, క్రాంతి గౌడ్‌ను ఔట్ చేసిన సోఫీ ఎకిల్‌స్టోన్(3-68) భారత ఇన్నింగ్స్‌కు తెరదించింది.
