IND vs WI : సొంతగడ్డపై చెలరేగిపోతున్న భారత జట్టు సిరీస్ విజయానికి చేరువైంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో వెస్టిండీస్‌ను ఓడించిన టీమిండియా ఢిల్లీ టెస్టు (Delhi Test)లోనూ ప్రత్యర్థిని హడలెత్తిస్తూ గెలుపుబాటలో పయనిస్తోంది. కుల్దీప్ యాదవ్, బుమ్రాల ధాటికి కుప్పకూలిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో పోరాడినా స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. 120 పరుగుల ఛేదనలో యశస్వీ జైస్వాల్ (8) త్వరగానే ఔటైనా.. సాయిసుదర్శన్(30 నాటౌట్), కేఎల్ రాహుల్(25 నాటౌట్) మరో వికెట్ పడనీయలేదు.ఇరువురు అజేయంగా రన్స్ జోడించారు. దాంతో.. నాలుగో రోజు ఆట ముగిసే సరికి 63 రన్స్ చేసింది టీమిండియా. ఇంకా విజయానికి అవసరమైన 58 పరుగులను రేపు తొలి సెషన్లోనే కొట్టేసి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయం.
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఓటమితో 11 సిరీస్ విజయాల రికార్డును కోల్పోయిన భారత జట్టు మళ్లీ పూర్వవైభవం దిశగా సాగుతోంది. వెస్టిండీస్‌ను తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో చిత్తుగా ఓడించిన టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు చూపించింది. అయితే..తొలి ఇన్నింగ్స్‌తో పోల్చితే.. ఫాలోఆన్ తర్వాత విండీస్ బ్యాటర్ల ఆట కాస్త మెరుగుపడింది. టాపార్డర్‌లో జాన్ క్యాంప్‌బెల్(115), షాయ్ హోప్(105) శతకాలతో చెలరేగి విండీస్‌ను ఆదుకున్నారు.
𝐈𝐧𝐧𝐢𝐧𝐠𝐬 𝐁𝐫𝐞𝐚𝐤!
Jasprit Bumrah wraps up the innings with his 3⃣rd wicket ☝️#TeamIndia need 1⃣2⃣1⃣ runs to win the match and the series 👍
Scorecard ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/N0Z0vsZwkL
— BCCI (@BCCI) October 13, 2025
వీరిద్దరి అసమాన పోరాటంతో లంచ్ వరకూ పటిష్ట స్థితిలో ఉన్న విండీస్ ఆ తర్వాత కుదేలైందిది. కొత్త బంతి తీసుకున్న తర్వాత సిరాజ్(2-43), కుల్దీప్ యాదవ్(3-104) రెచ్చిపోగా.. టపటపా ఆరు వికెట్లు కోల్పోయింది. చివరి వికెట్ కూడా తీసేసి 300లోపే ఆలౌట్ చేయాలనుకున్న భారత బౌలర్లను జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జైడన్ సీల్స్ (32) విసిగించారు. వీరిద్దరూ 79 పరుగుల భాగస్వామ్యంతో జట్టు స్కోర్ 350 దాటించారు. టీ సెషన్ తర్వాత బుమ్రా(3-44) ఓవర్లో సీల్స్ ఔట్ కావడంతో 390 వద్ద విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
స్వల్ప ఛేదనలో ధనాధన్ ఆడాలనుకున్న యశస్వీ జైస్వాల్(8)ను ఔట్ చేసిన వారికన్ విండీస్ శిబిరంలో జోష్ తెచ్చాడు. కానీ, ఆ తర్వాత వచ్చిన సాయిసుదర్శన్ (30 నాటౌట్) సాయంతో కేఎల్ రాహుల్(25 నాటౌట్) స్కోర్‌బోర్డును నడిపించాడు. నింపాదిగా ఆడిన ఇద్దరూ మరో వికెట్ పడకుండా చూసుకునేందుకే ప్రాధాన్యం ఇవ్వడంతో బౌండరీలు తగ్గిపోయాయి. రోస్టన్ ఛేజ్ ఓవర్లో సాయి రెండు ఫోర్లతో స్కోర్ 50 దాటింది. ఇద్దరూ రిస్క్ తీసుకోకపోవడంతో నాలుగో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా వికెట్ కోల్పోయి 63 రన్స్ చేసింది. ఇంకా విజయానికి అవసరమైన పరుగులు 58 మాత్రమే కావడంతో తొలి సెషన్లోనే శుభ్‌మన్ గిల్ సేన సిరీస్ అందుకోవడం ఖాయం.
That’s Stumps on Day 4⃣
Sai Sudharsan and KL Rahul with a solid unbeaten stand🤝#TeamIndia inching closer to victory 👍
Scorecard ▶ https://t.co/GYLslRyLf8#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/w0mlJUWemx
— BCCI (@BCCI) October 13, 2025