హైదరాబాద్, ఆట ప్రతినిధి: మహిళా క్రికెటర్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) దేశవాళీ లీగ్స్‌ను ప్రవేశపెట్టబోతున్నది. బుధవారం నిజామాబాద్‌లో హెచ్‌సీఏ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు, ప్రధాన కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే విషయంలో అమ్మాయిల తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలో తొలిసారి మహిళా క్రికెటర్ల కోసం డొమెస్టిక్ లీగ్‌ను తీసుకొస్తున్నాం. జాతీయ స్థాయితో పాటు డబ్ల్యూపీల్లో తెలంగాణ ప్రాతినిధ్యం పెరగాలి’ అని అన్నారు.