టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympcis ) మెన్స్ టెన్నిస్‌లో.. నోవాక్ జోకోవిచ్ ( Djokovic ) దారుణంగా ఖంగుతున్నాడు. బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన మ్యాచ్‌లో జోకోవిచ్‌పై 6-3, 6-7, 6-3 స్కోర్‌తో స్పెయిన్ ఆటగాడు కారెనో బుస్టా ( Pablo Carreno Busta )విజయం సాధించాడు. కీలకమైన మూడవ సెట్లో జోకోవిచ్ తేరుకోలేకపోయాడు. ఒలింపిక్స్‌లో సింగిల్స్ మెడల్ జోకోవిచ్‌కు దక్కకపోవడం శోచనీయం. అయితే మిక్స్డ్ డబుల్స్ లో బ్రాంజ్ మెడల్ కోసం జోకోవిచ్ ట్రై చేయనున్నాడు.