ATP Finals : టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ఏటీపీ ఫైనల్స్‌లో దూసుకెళ్లాడు. ఇటలీలోని ట్యూరిన్‌లో శనివారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్లో రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్(Carlose Aalcaraz)పై జకో అవలీలగా గెలుపొందాడు. వరుస సెట్లలో ఆధిపత్యం చెలాయించిన జకో 90 నిమిషాల్లోనే 6-3 6-2తో అల్కరాజ్ను చిత్తు చేశాడు. టైటిల్ పోరులో అతడు ఫేవరేట్ జన్నక్ సిన్నర్‌తో తలపడనున్నాడు.
ఈ ఏడాది జోరుమీదున్న జకోవిచ్‌కు ఇది ఏడో ఏటీపీ ఫైనల్ కావడం విశేషం. ఈ సీజన్లో ఆరు టైటిళ్లతో అతడు లెజెండరీ ఆటగాడు రోజర్ ఫెదరర్ (Roger Federer)రికార్డుతో సమానంగా నిలిచాడు. ఒకవేళ ఫైనల్లో సిన్నర్‌ను మట్టికరిపిస్తే జకో.. ఫెదరర్ రికార్డు బ్రేక్ చేస్తాడు. శనివారం జరిగిన మరో సెమీఫైనల్లో సిన్నర్ 6-3 6-7(4) 6-1తో డానిల్ మెద్వేదేవ్పై విజయం సాధించాడు. తద్వారా ఫైనల్ చేరిన తొలి ఇటలీ ఆటగాడిగా సిన్నర్ రికార్డు నెలకొల్పాడు.