French Open : ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) దూసుకెళ్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో అలవోకగా మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పోరులో స్పెయిన్‌కు చెందిన రాబెర్టో కర్బల్లెస్ బీనాను చిత్తుగా ఓడించాడు. రెండు సెట్లలో ఆధిపత్యం చెలాయించిన జకో.. 6-4, 6-1తో రాబెర్టోను మట్టికరిపించాడు.
రొలాండ్ గరోస్లో జకోవిచ్ మూడో రౌండ్‌కు చేరడం ఇది 19వ సారి. మరో మ్యాచ్‌లో బల్గేరియా స్టార్ గ్రిగర్ దిమిత్రోవ్ ముందంజ వేశాడు. ఫాబియన్ మరోజసేన్ను 6-0, 6-3, 6-4తో ఓడించి మూడో రౌండ్లో అడుగుపెట్టాడు.
తొలి రౌండ్లోనే రఫెల్ నాదల్కు చెక్ పెట్టిన అలెగ్జాండర్ జ్వెరెవ్(Alexander Zverev)మరో విజయం సాధించాడు. బెల్జియం కుర్రాడు డేవిడ్ గాఫిన్‌కు చుక్కలు చూపించాడు. 7-6 (4), 6-2, 6-2తో గెలుపొంది మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మహిళల విభాగంలో రెండో సీడ్ అరీనా సబలెంక.. క్వాలిఫయర్ ప్లేయర్‌కు ముచ్చెమటలు పట్టించి మూడో రౌండ్లో కాలుమోపింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్విటోతినా సైతం సూపర్ విజయంతో మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది.