అట్టహాసంగా సీఎం కప్ టోర్నీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు బుధవారం అట్టహాసంగా ముగిశాయి. మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన పోటీల్లో ప్లేయర్లు హోరాహోరీగా తలపడ్డారు. మొత్తం 11 క్రీడా విభాగాల్లో తలపడ్డ ప్లేయర్లు అద్భుత ప్రతిభ కనబరుస్తూ ట్రోఫీలు కైవసం చేసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ సత్తాచాటారు.
- ముగిసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు
- పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు బుధవారం అట్టహాసంగా ముగిశాయి. మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన పోటీల్లో ప్లేయర్లు హోరాహోరీగా తలపడ్డారు. మొత్తం 11 క్రీడా విభాగాల్లో తలపడ్డ ప్లేయర్లు అద్భుత ప్రతిభ కనబరుస్తూ ట్రోఫీలు కైవసం చేసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ సత్తాచాటారు. జిల్లా కేంద్రాలు వేదికలుగా జరిగిన సీఎం కప్‌లో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ పతకాలు కొల్లగొట్టారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన ప్లేయర్లు ఈ నెల 29 నుంచి మొదలయ్యే రాష్ట్ర స్థాయి పోటీల్లో తలపడనున్నారు.
పోటీలకు ఆఖరి రోజైన బుధవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో జరిగిన పోటీలకు క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలికితీసేందుకు సీఎం కప్ నిర్వహిస్తున్నాం. ఊహించిన దాని కంటే ఎక్కువగా జిల్లా స్థాయి టోర్నీలో ప్లేయర్లు పోటీపడ్డారు. వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ చాటారు. రాష్ట్ర స్థాయి టోర్నీలోనూ ఇదే పంథా కొనసాగించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, గీత సహకార సంస్థ చైర్మన్ రవికుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లపై సమీక్ష: సీఎం కప్ టోర్నీని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ నెల 29 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో జరిగే సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ నేపథ్యంలో బుధవారం సచివాలయంలో సుల్తానియా సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఆరు స్టేడియాల్లో పోటీపడే ప్లేయర్లకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

