Pro Panja League 2023 | న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్(ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్‌కు అట్టహాసంగా తెరలేచింది. ఇన్ని రోజులు విదేశాల్లో అలరించిన ఈ పోటీలు తాజాగా భారత్‌లో అభిమానులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి. శుక్రవారం జరిగిన తమ తొలి పోరులో కిరాక్ హైదరాబాద్ 3-14 తేడాతో లుధియానా లయన్స్ చేతిలో ఓటమిపాలైంది.
అండర్ కార్డ్ మ్యాచ్‌ల్లో మూడింట మూడు మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్..మెయిన్ కార్డ్‌లో ఒక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. షాహిల్షా, కాజి, వినాయక్ ఓటములతో నిరాశపరిచారు. 80కిలోల విభాగంలో అక్బర్ అలీ 3-1తో తేజాస్‌పై గెలిచాడు. హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం బరోడా బాద్షాస్తో తలపడుతుంది.