లండన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరోసారి చుక్కెదురైంది. నాకౌట్ దశలో తొలి రౌండ్లోనే భారత పురుషుల, మహిళల జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మంగళవారం రాత్రి పురుషుల జట్టు 0-3తో ఆస్ట్రియా చేతిలో ఓడిపోగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో మహిళల జట్టు 1-3తో యూఎస్ఏ చేతిలో ఖంగుతింది. ఉమెన్స్ సింగిల్స్‌లో మనికా (3-1) 11-2, 11-8, 8-11, 11-4తో ఒక మ్యాచ్‌లో గెలిచినా యశస్విని, దివ్య చిటాలె ఓడారు. మరోసారి బరిలోకి దిగిన మనికా తన రెండో సింగిల్స్‌లో పరాజయంతో టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించినైట్టెంది.