సింగపూర్: ముగింపు దశకు చేరుకున్న కొద్దీ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో పోరు రసవత్తరంగా సాగుతోంది. టోర్నీలో తొలి మ్యాచ్ గెలిచిన డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్.. 11 రౌండ్ల తర్వాత రెండో విజయాన్ని నమోదుచేశాడు. సోమవారం జరిగిన 12వ రౌండ్లో లిరెన్.. గుకేశ్‌పై 39 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఈ టోర్నీలో వరుసగా ఏడు గేమ్‌లు డ్రాగా ముగియగా 11వ గేమ్‌లో గుకేశ్ ఎట్టకేలకు గెలిచి ఆధిక్యంలోకి వచ్చాడు. కానీ సోమవారం లిరెన్ పుంజుకోవడంతో పాయింట్లు సమమయ్యాయి. కాగా 12 రౌండ్లు ముగిసేసరికి ఈ టోర్నీలో ఇరువురూ తలా 6 పాయింట్ల (మొదటగా 7.5 పాయింట్లు సాధించినవారు విజేత)తో సమానంగా ఉన్నారు. మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్న మోగా టోర్నీలో గుకేశ్, లిరెన్ తలా ఓ మ్యాచ్ నెగ్గినా లేక రెండు గేమ్‌లు డ్రా అయినా విజేతను నిర్ణయించేందుకు టై బ్రేకర్ అవసరం అయ్యే అవకాశముంది. అలా కాకుండా ఇరువురిలో ఒక్కరు వరుసగా రెండు గేమ్‌లను సొంతం చేసుకుంటే వారే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ కిరీటాన్ని దక్కించుకుంటారు. మంగళవారం సెలవు దినం కాగా బుధ, గురువారాలలో మిగిలిన రెండు రౌండ్స్ జరుగనున్న ఈ టోర్నీలో ఇకనుంచి హోరాహోరి పోరు జరగడం ఖాయం.