Dinesh Karthik : టీ20 వరల్డ్ కప్ ఎలైట్ కామెంటరీ ప్యానెల్లో ఒకడైన దినేశ్ కార్తిక్(Dinesh Karthik) ఈమధ్యే ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) అద్భుత విజయాల్లో భాగమైన కార్తిక్ ఎలిమినేటర్‌లో ఓటమితో వీడ్కోలు పలికేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌ను వదిలేసిన ఈ మాజీ ఆటగాడు తాజాగా ఆన్లైన్లో వైరల్ అవుతున్నాడు. ఒక వీడియోలో కార్తిక్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra)తో కలిసి జావెలిన్ త్రో సాధన చేశాడు.
అందులో చోప్రా సలహాలతో కార్తిక్ జావెలిన్ విసరడం నేర్చుకున్నాడు. రెండో ప్రయత్నంలో అతడు ఈటెను ఏకంగా 25 మీటర్ల దూరం విసిరి సంబురాలు చేసుకున్నాడు. దాంతో, ఆ వీడియో చూసిన వాళ్లంతా నువ్వు క్రికెట్ వదిలేసింది ఇందుకేనా? అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
Dinesh Karthik giving a tough competition to Neeraj Chopra. pic.twitter.com/Rd4mZajwMI
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2024
భారత క్రికెటర్లలో దినేశ్ కార్తిక్ ప్రయాణం విభిన్నమైనది. ఓవైపు కామెంటేటర్‌గా మాటల హోరుతో అలరిస్తూనే.. క్రికెటర్‌గానూ మైదానంలో అతడు అదరగొట్టాడు. రెండేండ్ల క్రితం ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో కార్తిక్ 2022లో పొట్టి ప్రపంచ కప్(T20 World Cup) స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన ఆ మెగాటోర్నీలో ఫినిషర్‌గా కార్తిక్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో, జట్టులో చోటు కోల్పోయాడు. ఇక అతడి పనై పోయిందిలే అనుకున్న వేళ పదిహేడో సీజన్లో కార్తిక్ ఓ రేంజ్లో ఆడాడు.

లీగ్ దశలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి ఖాయమనుకున్న దశలో అతడు సిక్సర్లతో చెలరేగాడు. పంజాబ్ బౌలర్లను ఉతికేస్తూ (23 నాటౌట్) గెలిపించాడు. అనంతరం288 పరుగులు రికార్డు ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sun risers Hyderabad)పై 35 బంతుల్లోనే 83 రన్స్‌తో వారెవ్వా అనిపించాడు.

టాపార్డర్‌లో కోహ్లీ, డూప్లెసిస్, రజత్ పాటిదార్, ఫినిషర్‌గా కార్తిక్‌లు రాణించినా సరే ఆర్సీబీ మరోసారి టైటిల్ వేటలో తడబడింది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి కార్తిక్ ఐపీఎల్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది. అదే రోజు కార్తిక్ తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్ టీ20 వరల్డ్ కప్‌లో తన కామెంటరీతో ఫ్యాన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.