Neeraj Chopra | ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో తొలిసారి స్వర్ణ పతకం కొట్టిన తొలి ఇండియన్ నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రో ఫైనల్స్‌లో తాను ఎటువంటి ఒత్తిడికి గురి కాలేదని పేర్కొన్నాడు. జావెలిన్ త్రో విభాగంలో 87.58 మీటర్ల దూరం విసిరి రికార్డు నెలకొల్పిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తాను అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం వల్ల ఫైనల్స్‌లో ఒత్తిడికి గురి కాలేదని చెప్పాడు.
తాను అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం వల్ల తొలి థ్రో 87.03 మీటర్లకు వెళుతుందని విశ్వాసంతో ఉన్నానని చెప్పాడు. థ్రో తర్వాత ఒలింపిక్స్ రికార్డు 90.57 మీటర్లు అని భావించా.. నా వ్యక్తిగా బెస్ట్ రికార్డు 88.07 మీటర్లు.. తదుపరి తన లక్ష్యం 90 మీటర్ల దూరం దాటాలని పెట్టుకున్నట్లు తెలిపాడు.
కరోనా వల్ల టోక్యో ఒలింపిక్స్-2020 వాయిదా పడటాన్ని తాను నెగెటివ్‌గా తీసుకోలేదన్నాడు. ఈ టోర్నీకి ప్రిపేర్ కావడానికి మరో ఏడాది టైం దొరికిందని భావించానని చెప్పాడు. ఇంతకుముందు కూడా మనం పతకాలు గెలుచుకున్నామని తెలిపాడు.
షూటింగ్లో స్వర్ణ పతకం గెలుచుకున్నాం.. హాకీలో పలు పసిడి పతకాలు మన ఖాతాలో చేరాయి. మిల్కా సింగ్, పీటీ ఉష కూడా గతంలో పసిడి పతకానికి చేరువలోకి వచ్చారు. అయితే, ఈ పతకం గెలుచుకోవడం చాలా ముఖ్యం అని నీరజ్ చప్రా పేర్కొన్నాడు.