ముంబై: ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ కల్గిన ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అమ్మకానికి వచ్చింది. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ ప్రస్తుత యజమానిగా వ్యవహరిస్తున్న డియాజియో అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి బుధవారం బాంబే స్టాక్ ఎక్సెంజ్(బీఎస్ఈ)కు ఈ విషయాన్ని తెలియజేసింది.
యూకేకు చెందిన డియాజియోకు భారత కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సబ్సిడరీగా వ్యవహరిస్తున్నది.ప్రస్తుత మార్కె ట్ అంచనాల ప్రకారం మార్చి 31లోపు ఆర్సీబీ అమ్మక ప్రక్రియ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 బిలియన్ డాలర్లకు అమ్ముడుపోయే చాన్స్ ఉంది.