Karthika Pournami | శివన్నామస్మరణతో మార్మోగిన రాజన్న ఆలయం.. వైభవంగా జ్వాలాతోరణం..
కార్తీకపౌర్ణమి సందర్భంగా వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం, భీమేశ్వరాలయం, భీమేశ్వరసదన్ బుధవారం కార్తీక దీపకాంతుల్లో వెలిగిపోయాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో నేతివత్తులతో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు.
Karthika Pournami | వేములవాడ టౌన్, నవంబర్ 5 : కార్తీకపౌర్ణమి సందర్భంగా వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం, భీమేశ్వరాలయం, భీమేశ్వరసదన్ బుధవారం కార్తీక దీపకాంతుల్లో వెలిగిపోయాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో నేతివత్తులతో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. దుయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తులు పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయం మార్మోగింది.

Vemulawada
వేకువజాము నుంచే భక్తులు అధికసంఖ్యలో ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కార్తీకదీపాలు వెలిగించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి భీమేశ్వరసదన్‌లో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించగా.. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం రాజన్న ఆలయ ముందు భాగంలో జ్వాలాతరణం కనుల పండుగా జరిపారు. వేకువజాము నుండే భక్తులు అధికసంఖ్యలో ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కార్తీకదీపాలు వెలిగించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి భీమేశ్వర సదన్‌లో లక్ష దీపోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.

Vemulawada
అనంతరం రాజన్న ఆలయం ముందు భాగంలో జ్వాలాతోరణ కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. జ్వాలాతోరణ కార్యక్రమం ఆద్యంతం భక్తులను తన్మయత్వంలో మునిగిపోయారు. కార్తీకమాసం ప్రారంభం నుంచి శివాలయాల్లో కార్తీకదీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా భీమేశ్వరాలయంలో ఆలయ అర్చకులు జ్వాలాతోరణానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ ఆర్టీవో రాధాబాయి, ఆలయ అధికారులు. అర్చకులు పాల్గొన్నారు.

Vemulawada

Vemulawada
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

