రాజ్‌కోట్: భారత యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన లిస్ట్-ఏ కెరీర్లో తొలి శతకం సాధించాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జురెల్ (101 బంతుల్లో 160*, 15 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో ఆ జట్టు.. బరోడాపై 54 పరుగుల తేడాతో గెలుపొందింది.
అతడికి తోడు కెప్టెన్ రింకూ సింగ్ (63) రాణించడంతో ఈ టోర్నీలో ఉత్తరప్రదేశ్ ఆడిన మూడింట్లో మూడు విజయాలు సాధించింది. 78 బంతుల్లోనే సెంచరీ చేసిన జురెల్.. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఫిఫ్టీలు నమోదుచేసి ఫామ్‌ను కొనసాగిస్తుండటం గమనార్హం.