IPL 2025 : టాస్ ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలుపెట్టింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(32)ను మెరుపులతో 8.9 రన్‌రేటుతో పరుగులు వచ్చాయి. దాంతో, స్పిన్నర్లను రంగంలోకి దింపిన రుతురాజ్ గైక్వాడ్ ఫలితం రాబట్టాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సాల్ట్‌ను ధోనీ మెరుపు స్టంపింగ్ చేశాడు. దాంతో, 45 వద్ద ఆర్సీబీ మొదటి వికెట్ పడింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(11), దేవ్‌దత్ పడిక్కల్(9)లు క్రీజులో ఉన్నారు. పవర్ ప్లేలో ఆర్సీబీ స్కోర్ .. 56-1.
చెపాక్ స్టేడియంలో బెంగళూరుకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(32), విరాట్ కోహ్లీ(11)లు శుభారంభం ఇచ్చారు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్ నుంచే సాల్ట్ అటాకింగ్ మొదలు పెట్టాడు. ఆ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన అతడు.. అశ్విన్‌కు సిక్సర్‌తో స్వాగతం పలికాడు.
Salt’s early fireworks have set the stage! 🔥
Time to use this momentum 🛞#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #CSKvRCB pic.twitter.com/6bzSGCJBHK
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2025
ఆ తర్వాత కూడా బౌండరీలతో సూపర్ కింగ్స్ బౌలర్ల లయను దెబ్బ తీశాడు. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ టైమింగ్ కుదరక ఇబ్బంది పడుతున్నాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఫుల్ టాస్‌ను కోహ్లీ బౌండరీకి పంపాడు. కానీ, ఆఖరిబంతికి సాల్ట్‌ను రెప్పపాటులో ధోనీ స్టంపింగ్ చేసి ఆర్సీబీకి షాకిచ్చాడు.