చెన్నై: నాలుగు పదుల వయసు (44)లో ఉన్నా భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్లోనూ ఆడతాడని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు. ఈ మేరకు ఆయన ‘క్రిక్‌బజ్’తో మాట్లాడుతూ.. ‘రాబోయే సీజన్లోనూ తాను అందుబాటులో ఉంటానని ధోనీ మాతో చెప్పాడు’ అని పునరుద్ఘాటించాడు.
ఈ నెల 15న ఐపీఎల్ రిటెన్షన్ డెడ్‌లైన్ ఉండటంతో ధోనీని చెన్నై అట్టిపెట్టుకుంటుందా? లేదా? అన్న విశ్లేషణల నేపథ్యంలో విశ్వనాథన్ వాటికి పుల్‌స్టాప్ పెట్టాడు.