MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) వయసు పైబడుతున్నా ఐపీఎల్‌లోనూ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. మిస్టర్ కూల్ సారథిగా కోట్లాది మంది అభిమానులన్ని సంపాదించుకున్న మహీ భాయ్ తనపై బురదజల్లే వాళ్లను మాత్రం వదిలిపెట్టడు. పదేళ్ల క్రితం తన పరువును దెబ్బతీసేలా వ్యవహరించినందుకు ధోనీ మీడియా సంస్థపై కోర్టులో పరువు నష్టం (Defamation Case) కేసు వేశాడు. ఇప్పుడీ కేసు విచారణ జరుగనున్న నేపథ్యంలో ధోనీ కోర్టుకు వెళ్లి తన స్టేట్మెంట్ రికార్డు చేయనున్నాడు.
పదేళ్ల క్రితం ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టకు భంగం కలిగించిన ఒక మీడియా సంస్థపై, కొందరు జర్నలిస్ట్‌లపై కేసు వేసిన తాలా.. 100 కోట్లు డిమాండ్ చేశాడు. అయితే.. ఈ కేసు కొన్నిరోజులు పెండింగ్‌లో ఉంది. ఈమధ్యే మద్రాస్ హైకోర్టు దీన్ని పరిష్కరించేదిశగా చర్యలు చేపట్టింది.
ఐపీఎల్లో 2013 సంవతర్సరం ‘స్పాట్ ఫిక్సింగ్’ (Spot Fixing) కలకలం సృష్టించించింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల (2016, 2017) నిషేధం విధించింది బీసీసీఐ. అప్పుడు ఒక టీవీ డిబేట్లో కొందరు జర్నలిస్ట్‌లు అప్పుడు సీఎస్కే సారథిగా ఉన్న ధోనీకి ఫిక్సింగ్‌లో ప్రమేయం ఉందని కామెంట్లు చేశారు. దాంతో.. తన తప్పేమీ లేకున్నా తన పరువును దెబ్బతీయాలనే ఉద్దేశంతో సదరు మీడియా సంస్థ చేసిన కల్పిత వ్యాఖ్యల్ని ధోనీ ఖండించాడు. అంతటితో ఊరుకోకుండా పరువునష్టం కేసు కింద తనకు రూ.100 కోట్లు చెల్లించాలని 2014లో కోర్టును ఆశ్రయించాడు మహీ భాయ్. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్‌లోనే ఉంది.
In 2013, Delhi Police arrested 3 Rajasthan Royals players—S. Sreesanth, Ajit Chandila, and Ankeet Chavan—for their involvement in spot-fixing during IPL matches. pic.twitter.com/MdH7HwPMui
— Ragav 𝕏 (@ragav_x) March 30, 2025
తాజాగా మద్రాస్ హై కోర్టుకు చెందిన జస్టిస్ సీ.వీ.కార్తికేయన్ ఆదేశాలతో ధోనీ పెట్టిన పరువు నష్టం కేసులో పురోగతి కనిపించేలా ఉంది. ఈక్రమంలోనే ధోనీని కోర్టులో హాజరై తన వాదనలు వినిపించాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది అక్టోబర్ 20, డిసెంబర్ 10వ తేదీల్లో ధోనీ తన స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిందిగా కోర్టు వెల్లడించింది.
స్పాట్ ఫిక్సింగ్ కేసులో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ (N. Sreenivasan), అతడి అల్లుడు గురునాథ్ మీయప్పన్, రాజస్థాన్ ఫ్రాంచైజీ సహ యజమాని రాజ్ కుంద్రాలు విచారణ ఎదుర్కొన్నారు. బుకీలతో మాట్లాడినందుకు రాజస్థాన్ జట్టులోని శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలు అరెస్ట్ అయ్యారు. ఫిక్సింగ్ ఆరోపణలతో సీఎస్కేపై రెండేళ్ల నిషేధం కారణంగా ధోనీ రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టుకు మారాల్సి వచ్చింది.
If you are a wicketkeeper-batter, you can become the captain of the Super Giants team in the IPL. 😉
WK captains of Super Giants teams in IPL:
Dhoni in 2016 (Rising Pune Supergiant)
KL in 2022-24 (Lucknow Super Giants)
Pant in 2025* (Lucknow Super Giants) pic.twitter.com/yyOrjU1xyi
— All Cricket Records (@Cric_records45) January 20, 2025