Dhoni – Rohit : ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(Mumbai Iindians), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ రెండు జట్ల మధ్య పోరాటం రసవత్తరంగా, అభిమానులను రంజింపజేసేలా సాగుతుంది. అయితే.. ఈసారి మాత్రం మునపటంతా ఆసక్తిగా మాత్రం అనిపించడం లేదు. అందుకు కారణం.. ఆరంభ సీజన్ నుంచి తమదైన ఆటతో, అద్భుతమైన నాయకత్వంతో ఐపీఎల్‌పై చెరగని ముద్ర వేసిన రోహిత్ శర్మ(Rohit Sharma), ఎంఎస్ ధోనీ(MS Dhoni) బిగ్ మ్యాచ్ ఆడడం లేదు. గాయం కారణంగా ఇద్దరూ మ్యాచ్‌కు దూరమయ్యారు.
ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా రోహిత్, ధోనీ లేకుండా ముంబై, చెన్నై తలపడుతున్నాయి. గురువారం వాంఖడేలో ఇరుజట్ల సారథులు ప్రకటించిన పదకొండు మందిలో ఈ ఇద్దరు దిగ్గజాల పేర్లు లేవు. వెటరన్ ప్లేయర్లు లేకపోవడంతో మ్యాచ్ కళ తప్పిందని విశ్లేషకులు, అభిమానులు వాపోతుండగా.. ఐపీఎల్లోఒక శకం ముగిసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
End of an era.
This is the first MI vs CSK game without Rohit Sharma and MS Dhoni in the playing XI pic.twitter.com/v9Xgxjrz5w
— ESPNcricinfo (@ESPNcricinfo) April 23, 2026
నలభై దాటిన ధోనీ(44) ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడనే వార్తలు వినపిస్తున్నాయి. అయితే.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మాత్రం ధోనీ ఎప్పుడు ఆడుతాడు? అనే ప్రశ్నకు బదులివ్వలేకపోతోంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చెన్నై తేలిపోతున్న.. పెద్దన్నలా సలహాలు, సూచనలు ఇచ్చే ధోనీ మాత్రం పంతొమ్మిద్ సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు.

మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోని తాల జట్టుతో ఉంటూ.. నెట్స్‌లో కనిపిస్తున్నా తుది జట్టులో ఉండడం లేదు. ఇక రోహిత్ విషయానికొస్తే.. తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న అతడు వరసగా రెండో మ్యాచ్‌కు అందుబాటులో లేడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడని హిట్‌మ్యాన్ సీఎస్కే పోరుకు దూరమయ్యాడు.