Anant -Radhika Wedding : భారత కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడి వివాహానికి క్రీడా దిగ్గజాలు తరలివెళ్లారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ (Anant Ambani), రాధికా మర్చంట్ (Radhika Merchant)ల శుభ్ వివాహ్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
యావత్ భారతం కనీవినీ ఎరుగనంత ఆర్భాటంగా, అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), ఎంఎస్ ధోనీ (MS Dhoni)లు సతీ సమేతంగా పాల్గొన్నారు. టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సైతం వివాహ మహోత్సవంలో తళుక్కుమంది. క్రీడాలోకంతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం అంబానీ పెండ్లి వేడుకలో ఆడిపాడి తరించారు.
MS Dhoni & his family at Anant Ambani’s Shubh Aashirwad ceremony. ❤️
– Cutest picture of the day. pic.twitter.com/JZ2GMFe4JA
— Johns. (@CricCrazyJohns) July 13, 2024
కొన్నేండ్లుగా ప్రేమలో ఉన్న అనంత్, రాధికలు పెండ్లితో ఒక్కటయ్యారు. యావత్ భారతంతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఈ ఇద్దరూ జూలై 12 శనివారం రాత్రి 8:00 గంటకు వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమక్షంలో అనంత్, రాధికలు దాంపత్య బంధంలో అడుగు పెట్టారు. ఆద్యంతం కన్నుల పండువగా సాగిన వీళ్ల వివాహ క్రతువు బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్‌కు అద్దం పట్టింది.
Congratulations to Anant Ambani & Radhika Merchant on tying the knot! 💒 #AnantwedsRadhika #AnantRadhikaWedding #AnantAmbani #RadhikaMerchant #MukeshAmbani #NitaAmbani pic.twitter.com/7JAANfvpym
— 𝑺𝒖𝒎𝒊𝒕 𝑺𝒊𝒏𝒈𝒉 𝑹𝒂𝒋𝒑𝒖𝒕 (@BeingSumit007) July 12, 2024