Cameron Green | అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మంగళవారం జరిగిన వేలంలో కామెరాన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. వేలంలో రూ.25.20 కోట్లు దక్కినా.. చివరకు అతనికి దక్కేది మాత్రం కేవలం రూ.18 కోట్లు మాత్రమే. అందుకే ఐపీఎల్ కొత్త నిబంధనలే కారణం. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటంటే.. ఐపీఎల్ పాలక మండలి గతేడాది మాక్సిమమ్ ఫీజు పేరుతో నిబంధనను తీసుకువచ్చింది. మినీ వేలంలో పలువురు విదేశీ ప్లేయర్లు డిమాండ్, సప్లయ్ వ్యత్యాసాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని పలు ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దాంతో ఐపీఎల్ పాలక మండలి ఈ రూల్‌ను తీసుకువచ్చింది. మినీ వేలంలో ఒక ఆటగాడిగా గరిష్టంగా రూ.18కోట్లకు మించి ఫీజు చెల్లించకూడదు. వేలంలో అంతకన్నా ఎక్కువ ధర పలికినా.. అదనపు మొత్తాన్ని బీసీసీఐ ఆటగాళ్ల సంక్షేమానికి వినియోగిస్తుంది. ఈ నిబంధనతో రూ.7.20 కోట్లను మినహాయించి కామెరాన్ గ్రీన్‌కు రూ.18కోట్లు చెల్లిస్తారు.
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ వేలంలో మొన్నటి వరకు రూ.24.75కోట్ల ధరతో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా మిచేల్ స్టార్క్ నిలిచాడు. కేకేఆర్ 2024లో భారీ ధరకు స్టార్క్ తాజా వేలంలో కామెరాన్ గ్రీన్ కేకేఆర్ జట్టు రూ.25.20కోట్లకు దక్కించుకుంది. ఇక ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర పలిగిన ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్ రూ.27 కోట్లు, శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్లతో తొలి రెండుస్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత కామెరాన్ గ్రీన్ మూడో స్థానంలో నిలిచాడు. కామెరాన్ గ్రీన్ 2023లో ముంబయి ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2024 సీజన్లో ట్రేడింగ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. గత సీజన్లో 13 మ్యాచ్‌లలో 255 పరుగులు చేసి పది వికెట్లు తీశాడు. మినీ వేలానికి ముందు కామెరాన్ గ్రీన్‌ను ఆర్సీబీ రిలీజ్ చేసింది. దాంతో మినీ వేలంలోకి వచ్చి భారీ ధరకు అమ్ముడుపోయాడు.