Inter Exams | తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. మార్చి 3న జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను మార్చి 4న నిర్వహించనున్నట్లు పేర్కొంది. మార్చి 3న హోలీ పండుగ రావడంతో పరీక్షల తేదీల్లో ఈ మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మిగతా పరీక్షలన్నీ యథాతథంగా జరుగుతాయని వివరించింది. ఇదిలా ఉండగా.. ప్రాక్టికల్ పరీక్షలు సైతం యథావిధిగా కొనసాగుతాయని చెప్పింది. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 2న ప్రారంభమై 21 వరకు జరుగుతాయని.. ఇందులో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మార్పులను గమనించాలని కోరింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్ను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
ఫిబ్రవరి 25 : సెకెండ్ లాంగ్వేజ్
ఫిబ్రవరి 27 : ఇంగ్లీష్
మార్చి 2 : మ్యాథమెటిక్స్ 1ఏ- బోటని-పొలిటికల్ సైన్స్
మార్చి 5 : మ్యాథమెటిక్స్ 1బీ-జువాలజీ-హిస్టరీ
మార్చి 9 : ఫిజిక్స్ -ఎకనమిక్స్
మార్చి 12 : కెమిస్ట్రీ / కామర్స్
ఫిబ్రవరి 26 : సెకెండ్ లాంగ్వేజ్
ఫిబ్రవరి 28 : ఇంగ్లీష్
మార్చి 4 : మ్యాథమెటిక్స్ 2ఏ- బోటని-పొలిటికల్ సైన్స్
మార్చి 6 : మ్యాథమెటిక్స్ 2బీ- జువాలజీ-హిస్టరీ
మార్చి 10 : ఫిజిక్స్-ఎకనమిక్స్
మార్చి 13 : కెమిస్ట్రీ-కామర్స్