ఫ్లోరిడా (అమెరికా): భారత యువ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్ ఫ్లోరిడాలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో కాంస్యంతో మెరిశాడు.
పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ధీరజ్ 6-4 (28-28, 28-29, 29-29, 29-28, 30-29)తో ఆండ్రెస్ టెమినో(స్పెయిన్)ను ఓడించి పతకం గెలిచాడు. ఈ టోర్నీలో అతడికిది రెండో పతకం. ధీరజ్ ఇది వరకే పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్లో రజతం గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.