హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జాతీయస్థాయిలో నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన 33 మంది పోలీస్ అధికారులకు డీజీపీ అంజనీకుమార్ శనివారం తన కార్యాలయంలో నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
2018 నుంచి 2023 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్, బ్యాడ్మింటన్, వాటర్ స్పోర్ట్స్, వాలీబాల్, రెజ్లింగ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వంటి విభాగాల్లో.. స్వర్ణ పతకం సాధించిన వారికి 3 లక్షలు, రజత పతకానికి 2 లక్షలు, కాంస్య పతకానికి లక్ష చెకులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీలు అభిలాష బిస్త్, శిఖాగోయెల్, మహేశ్ భగవత్, సౌమ్యమిశ్రా, ఐజీ షానవాజ్ ఖాసీం పాల్గొన్నారు.