జోహన్నస్బర్గ్ : దక్షిణాఫ్రికా యువ సంచలనం, అభిమానులు ముద్దుగా బేబీ ఏబీగా పిలుచుకునే డెవాల్డ్ బ్రెవిస్ ఆ దేశ క్రికెట్ లీగ్ ఎస్ఏ20 వేలంలో రికార్డు ధర దక్కించుకున్నాడు. మంగళవారం జోహన్నస్బర్గ్లో జరిగిన వేలం ప్రక్రియలో బ్రెవిస్ ఈ లీగ్ చరిత్రలోనే అత్యధికంగా 16.5 మిలియన్లు (రూ. 8.3 కోట్లు) దక్కించుకుని కొత్త రికార్డులు సృష్టించాడు.
ప్రిటోరియా క్యాపిటల్స్ బ్రెవిస్ కోసం భారీ ధరను వెచ్చించి సొంతం చేసుకుంది. బ్రెవిస్తో పాటు దక్షిణాఫ్రికా టీ20 సారథి ఎయిడెన్ మార్క్మ్న్రు డర్బన్ సూపర్ జెయింట్స్ రూ. 7 కోట్లకు దక్కించుకుంది.