బెంగుళూరు: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో.. టీమిండియా తడబడుతున్నది. రెండో రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా ఆరంభంలోనే త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. 9.4 ఓవర్లలో 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే సర్ఫరాజ్ ఖాన్ మూడవ వికెట్ రూపంలో ఔటయ్యాడు. భారీ షాట్ ఆడబోయిన సర్ఫరాజ్.. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో లాంగ్ ఆఫ్ మీదుగా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అయితే ఎక్స్ట్రా కవర్లో ఉన్న డేవాన్ కాన్వే అద్భుతమైన రీతిలో క్యాచ్ అందుకున్నాడు. కుడి వైపు డైవ్ చేసి.. ఒంటి చేతితో బంతిని అందుకున్నాడు. స్టన్నింగ్ క్యాచ్ పట్టిన కాన్వే వీడియో చూడండి.
Conway’s leap of faith 🤯☝️#TeamIndia lose their 3rd wicket early on in Bengaluru! #INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/gM3dSzIgKn
— JioCinema (@JioCinema) October 17, 2024
వర్షం బ్రేక్ తర్వాత మళ్లీ ఇండియా బ్యాటింగ్ చేస్తున్నది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔటయ్యాడు. రూర్కే బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. ఇండియా 22 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 33 రన్స్ చేసింది.