బెంగుళూరు: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు(Ind Vs Nz) తొలి ఇన్నింగ్స్‌లో.. రెండో రోజు టీ విరామ సమయానికి న్యూజిలాండ్ జట్టు వికెట్ నష్టానికి 82 రన్స్ చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే 61 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో కాన్వే డేరింగ్ షాట్స్ ఆడాడు. ఇండియాకు అనుకూలించని పిచ్‌పై కాన్వే చాలా ఫ్రీగ్ షాట్లు కొట్టేశాడు. శరవేగంగా అతను స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. కాన్వే ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. స్పిన్నర్ కుల్దీప్కు ఓ వికెట్ దక్కింది.
అంతకు ముందు భారత్ 46 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. దారుణంగా కుప్పకూలింది. ఇండియన్ ఇన్నింగ్స్‌లో అయిదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. పంత్ అత్యధికంగా 20 రన్స్ చేశాడు. హెన్రీ 5, రౌర్కీ 4 వికెట్లు తీసుకున్నారు.
Tea on Day 2 of the opening #INDvNZ Test!
New Zealand move to 82/1 in the first innings.
Stay tuned for the final session of the day.
Live – https://t.co/FS97LlvDjY#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/4TM7hWijar
— BCCI (@BCCI) October 17, 2024