MIW vs GGW : గుజరాత్ నిర్దేశించిన భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు దంచేస్తున్నారు. ఓపెనర్లు త్వరగానే ఔటైనా అమన్‌జోత్ కౌర్(40), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(43 నాటౌట్)లు కీలక భాగస్వామ్యం నిర్మించారు. బౌండరీలతో చెలరేగుతూ స్కోర్ వేగం పెంచింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సోఫీ డెవినె విడదీసింది. సిక్సర్‌కు యత్నించిన అమన్‌జోత్ బౌండరీ లైన్ వద్ద గార్డ్నర్ చేతికి చిక్కింది. దాంతో వద్ద ముంబై మూడో వికెట్ పడింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్, నికోలా కారీ(5 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఓవర్లకు స్కోర్.. 124–3. ఇంకా ముంబై విజయానికి 69 పరుగులు కావాలి.
Just WOW 🤩
Harmanpreet Kaur has lofted that with ease! 💥
Updates ▶️ https://t.co/Dxufu4Pisz#TATAWPL | #KhelEmotionKa | #MIvGG pic.twitter.com/iK6HLFyYos
— Women’s Premier League (WPL) (@wplt20) January 13, 2026
మహిళల ప్రీమియర్ లీగ్‌లో భారీ స్కోర్లతో చెలరేగుతున్న గుజరాత్ జెయింట్స్ మూడో మ్యాచ్‌లో రెండొందలకు చేరువైంది. అలాఅనీ ఓపెనర్లు దంచేయలేదు. ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి 99కే నాలుగు వికెట్లు పడిన వేళ.. జార్జియా వరేహం(43 నాటౌట్), భారతి ఫుల్మావి(36 నాటౌట్)లు గుజరాత్ స్కోర్ 150 దాటడమే గగనం అనిపించింది. కానీ, డెత్ ఓవర్లలో వరేహం, భారతి విధ్వంసం సృష్టించారు. అమన్‌జోత్ కౌర్ వేసిన ఆఖరి ఓవర్లో రెచ్చిపోయిన భారతి.. 23 రన్స్ రాబట్టగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 192 పరుగులు చేయగలిగింది.