బ్యాంకాక్ : యువ భారత షట్లర్ దేవిక షగ్ బీడబ్ల్యూఎఫ్ థాయ్‌లాండ్ మాస్టర్స్ 300 టోర్నీలో సంచలన ప్రదర్శనతో సత్తాచాటింది. ఈ 20 ఏండ్ల హర్యానా అమ్మాయి మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఫైనల్లో దేవిక.. 21-8, 6-3తో మలేషియా షట్లర్ గోజిన్ వీపై గెలిచి తన కెరీర్లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ 300 టైటిల్‌ను గెలుచుకుంది. తద్వారా గతంలో ఈ ఘనత సాధించిన పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది. తొలి గేమ్‌లోనే దేవిక జోరు ముందు తేలిపోయిన మలేషియా అమ్మాయి.. రెండే గేమ్ ఆరంభంలోనే గాయం కారణంగా ఆట నుంచి తప్పుకుంది.